AP Ration Card Status 2025: Check Your Ration Card Application Status Online
AP Ration Card Status 2025: 2025 మే 7న విడుదలైన తాజా మార్గదర్శకాలు ప్రకారం, రేషన్ కార్డ్ సేవల కోసం దరఖాస్తు చేయడానికి ప్రజలు తమ సొంత గ్రామం లేదా వార్డు సచివాలయానికి వెళ్లాలి. అక్కడే రేషన్ కార్డ్ అప్లికేషన్‌తో పాటు రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రసీదులో TNumber ఉంటుంది ఈ నంబర్ ద్వారానే మీరు మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
State | Andhra Pradesh |
Category | Ration Card Services |
Mode | Online |
Official Website | Click Here |
AP Ration Card Approval Steps:-
- రేషన్ కార్డ్ అప్లై చేయడం
- eKYC ప్రక్రియ పూర్తికావడం – ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత e-kyc కి పేర్లు రావటానికి సమయం పడుతుంది.
- పేర్లు వచ్చిన తర్వాత – GSWS ఉద్యోగులు GSWS Employees App ద్వారా eKYC నిర్వహిస్తారు.
- తర్వాత VRO వారి దశ – వారు AP Seva Portal లో వచ్చే Six Step Validation Form ని సరిచూస్తారు.
- MRO ఆమోదం – VRO నివేదికల ఆధారంగా MRO వారు దరఖాస్తును ఆమోదిస్తే, రేషన్ కార్డ్ మంజూరు అవుతుంది.
సరైన సేవ ఆధారంగా, ఈ మొత్తం ప్రక్రియకు 21 రోజుల నుండి 6 నెలల వరకు సమయం పడవచ్చు.
AP Ration Card Status 2025: Step By Step
- ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేయండి.

- తర్వాత పైన కనిపించే విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ Services Request Status Check అనే ఆప్షన్ కనబడుతుంది దానిపైన క్లిక్ చేయండి.
- ముందు చెప్పిన విధంగా మీరు మీ సచివాలయం లో అప్లై చేసినప్పుడు మీకు ఒక రిసెప్ట్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన ఉన్న TNumber నీ అక్కడ ఎంటర్ చెయ్యండి.
- తర్వాత pop up ఓపెన్ అవుతుంది అక్కడ captcha కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి.

- తర్వాత పైన కనిపించే విధంగా మీ రైస్ కార్డ్ స్టేటస్ కనబడుతుంది. ఏ లాగిన్ లో పెండింగ్ ఉంది, అప్రూవ్ అయ్యిందా లేదా రిజెక్ట్ అయ్యిందా అనే విషయాన్ని అక్కడ చూపిస్తుంది.
✅ Rice Card Status Check Click Here
ఈ విధంగా మీరు మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు
మరెన్నో గవర్నమెంట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా పేజీ ను ఫాలో అవ్వండి.అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చెయ్యండి.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇