🌾 PM Kisan Beneficiary Status 2025
PM Kisan Beneficiary Status 2025 :: రైతులకి గుడ్ న్యూస్! పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత కోసం ఎదురుచూస్తున రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయంగా ఈ పథకం యొక్క 20వ విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
♐ Overview Of PM Kisan Beneficiary Status 2025
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయంగా చేయడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఈ పథకం యొక్క చివరి(19వ) విడత డబ్బులను ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఆ తర్వాత విడత అయిన 20వ విడత ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల కానున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.6 వేల రూపాయలను మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. 20వ విడత కి సంబంధించిన అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది.
✅ Eligibility For PM Kisan Nidhi Yogana 2025
అర్హులు అయిన ప్రతి ఒక్క రైతు పీఎం కిసాన్ బెనిఫిట్ కోల్పోకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది అది కూడా మే 31, 2025 నాటికి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- తప్పనిసరిగా E-KYC పూర్తి చేసి ఉండాలి.
- బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ కార్డు తో లింక్ చేసుకొని ఉండాలి.
- మీ భూమి వివరలను ధృవీకరించాలి.
ఈ-కేవైసీ నీ ఇంటి వద్ద ఉండి మొబైల్ లోనే చేయవచ్చును. అయితే ఇలా చేయడానికి మొత్తం మూడు పద్ధతులు ఉన్నాయి. వాటిలో మీకు ఏది సులభంగా ఉంటుందో దాని ద్వారా చేసుకోండి. ఆ మూడు పద్ధతులను ఇపుడు వివరంగా తెలుసుకుందాం.
PM Kisan Mobile App : ముందుగా మీ మొబైల్ లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి పీఎం కిసాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్, రిజిస్ట్రేషన్ ఐడి వంటి వాటిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి. మీ నెంబర్ కు వచ్చిన otp ని ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు ఫేస్ అతెంతికేషన్ ఫీచర్ వంటి ద్వారా e-kyc ను సులభంగా చేసుకోవచ్చును.
Official Portal : పీఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి. హోమ్ పేజీ లో ఉన్న E-KYC పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, మీ ఫోన్ నెంబర్ కు వచ్చిన otp ని ఎంటర్ చేయండి. ఇలా మీరు పోర్టల్ ద్వారా చేసుకోవచ్చును.
Common Service Centre : మీకు దగ్గర లో ఉన్న సర్వీస్ సెంటర్ లేదా మీ సేవ వంటి వాటిలోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చును.
🔍 How To Check your Name In The beneficiaries List
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత డబ్బులను విడుదల చేసే ముందు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఇది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.pmkisan.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి. హోమ్ పేజీ లో “Farmers Corner” కు వెళ్లండి. ఇపుడు “Beneficiary List” ను సెలెక్ట్ చేసుకోండి. ఇపుడు మీ స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్-డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ వంటి వివరాలను ఎంటర్ చేయండి. ఆ తర్వాత “Get Report” బటన్ పై క్లిక్ చేయండి.
💰 How To Check PM Kisan Payment Status
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.pmkisan.gov.in ను ఓపెన్ చేయండి.
Step 2 : హోం పేజీలో ఉన్న “Farmers Corner” ను ఎంచుకొని, “Know Your Status” ను క్లిక్ చేయండి.
Step 3 : ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ వంటి వాటిని ఎంటర్ చేయండి.
Step 4 : Captcha ను ఎంటర్ చేసి, Get Otp పై క్లిక్ చేయండి.
Step 5 : మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన Otp నీ ఎంటర్ చేయండి.
Step 6 : ఆ తర్వాత View Status పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మీ పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది.
✅ Imporatant Links
పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్, అలాగే ఈ కేవైసీ స్టేటస్, అర్హుల లిస్టు క్రింద ఇచ్చిన టేబుల్లో ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోండి.
🔥 PM KISAN Benificiary స్టేటస్ లింక్ | Click Here |
🔥 PM Kisan అర్హుల జాబితా | Click Here |
🔥 అన్నదాత సుఖీభవ స్టేటస్ | Click Here |
🔥 PM Kisan Ekyc Link | Click Here |
🔥 కొత్తగా రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
❓PM KISAN Benificiary Status FAQs

Q 1. PM-KISAN డబ్బులు రాలేదు. ఏమి చేయాలి?
A: బెనిఫిషియరి స్టేటస్ చెక్ చేయండి. ‘FTO Generated’, ‘Payment Under Process’ లాంటి మెసేజెస్ వస్తే వేచిచూడాలి. బ్యాంక్ వివరాలు లేదా ఆధార్ లో తప్పులుంటే స్థానిక రైతు సేవా కేంద్రం (CSC) లో సరి చేయించండి.
Q 2. కొత్తగా నమోదు ఎలా చేయాలి?
A: pmkisan.gov.in లో “New Farmer Registration” ద్వారా ఆన్లైన్‌లో లేదా మీ గ్రామ వాలంటీర్/CSC ద్వారా అప్లై చేయవచ్చు.
Q 3. బెనిఫిషియరి లిస్ట్ ఎక్కడ చూసుకోవచ్చు?
A: వెబ్‌సైట్‌లో “Beneficiary List” సెక్షన్‌లో మీ రాష్ట్రం, జిల్లా, గ్రామం ఎంచుకుని లిస్ట్ చూడొచ్చు.
Q 4. బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ తప్పుగా నమోదైతే ఏమి చేయాలి?
A: మీ గ్రామంలో ఉన్న CSC సెంటర్ లేదా జిల్లా వ్యవసాయ శాఖ ఆఫీస్‌ను సంప్రదించి వివరాలు సరిచేయాలి.
Q 5. ఆధార్‌తో లింక్ అవ్వలేదని చూపిస్తోంది. ఎందుకు?
A: బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. లేదంటే NPCI ద్వారా డబ్బులు జమ కాదు. బ్యాంకులో లింక్ చేయించాలి.
🏷️ Related TAGS
pm kisan beneficiary status check, pm kisan status check 2025, pm kisan 20th installment status 2025, pm kisan yojana status check 2025, pm kisan status, pmkisan.gov.in status 2025, pm kisan payment status, pm kisan ₹2000 payment status
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇